
విరాటపర్వం..ఈ మధ్యకాలంలో బాగా క్రేజ్ వచ్చిన సినిమా రానా,సాయిపల్లవి లు నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం. నీది నాది ఒకే కథ మూవీతో తన మార్కు చాటుకున్న వేణు ఉడుగుల ఈ సినిమాను తీయడం ,పాటలు ప్రోమోలతో ఇంట్రెస్ట్ కలగడం వల్ల ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కున్న ఈ మూవీ ఫైనల్ గా థియేటర్లో వచ్చింది.అంచనాలకు తగ్గట్టే ఉందా లేదా అనేది చూద్దాం.
కథ :
ఈ మూవీ కథ 1990 లో తెలంగాణ ప్రాంతంలో జరిగింది. దాన్ని ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ‘‘వెన్నెల’’ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. నక్సలైటు గా ఉన్న రవన్న పై మనసు పడుతుంది.అతని రచనలకు,మాటలకు ఇన్ స్పైర్ అవుతుంది.తన ప్రేమ ను గెలిపించు కోవడానికి ఎం చేసింది. ఆయన్ను కలిసిందా లేదా.? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? వాళ్లిద్దరి జీవితాల్లోకి,పోలీసులు, రాజకీయ శక్తులు ఎలా వచ్చాయి అనేది కథ.
ఎవరెవరు ఎలా చేశారంటే :
రానా నక్సలైట్ పాత్రలో ఒదిగిపోయాడు. పవర్ ఫుల్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.డైలాగులు కూడా అద్భుతంగా పలికాడు.హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు అతన్ని అభినందించాలి. సాయిపల్లవి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అందించింది. సినిమాను నిలబెట్టింది తానే అని చెప్పాలి.ఆమెను అందరూ లేడీ పవర్ స్టార్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.నందితా దాస్ ముఖ్య పాత్రలో మెప్పిస్తుంది. ప్రియమణి,నవీన్ చంద్ర సహాయ పాత్రల్లో మంచి నటన కనబరిచి సినిమాకు ప్లస్ అయ్యారు.సాయి పల్లవి తల్లి పాత్ర లో ఈశ్వరీ రావు ఒదిగిపోయి నటించింది. తండ్రి పాత్రలో సాయి చంద్ రాణించారు. రానా తల్లి పాత్ర లో జరీనా వహబ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ అందించింది.రాహుల్ రామకృష్ణ,బెనర్జీ తదితరులు తమకు అలవాటైన రోల్స్ చేశారు.
సాంకేతిక బృందం :
డాని షన్ చాజ్,దివాకర్ మణి అద్భుతమైన విజువల్స్ సినిమాకు ప్రాణం పోసాయి. తెలంగాణ పల్లెలు,అడవి అందాలను చక్కగా చూపించారు. సురేష్ బొబ్బిలి పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యం గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను బాగా ఎలివేట్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.ఇలాంటి సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు నిర్మాత లను అభినందించాలి. వేణు ఉడుగుల రాసుకున్న డైలాగులు వావ్ అనిపిస్తాయి.
సినిమా ఎలా ఉందంటే?
విరాట పర్వం రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.1990 ల్లో తెలంగాణ ప్రాంతంలో నిజంగా జరిగిన కథ. ఒక అమ్మాయి తన ప్రేమ కోసం ఎంత వరకు వెళ్లిందో నిజాయితీగా చూపించాడు డైరెక్టర్ వేణు ఉడుగుల.సినిమాలో వెన్నెల రవన్న ను ఎంత ప్రేమించిందో డైరెక్టర్ వేణు ఈ కథ ను అంతలా ప్రేమించి తీసినట్టు కనిపించింది. తన ఎఫ్ఫర్ట్స్ ని మెచ్చుకోవాలి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మట్టి కథలు ఇంకా పుడతాయి. ఇక రెగ్యులర్ సినీ జనాలకు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.
ఒక అమ్మాయి ప్రేమ కోసం పిచ్చి దాని ల అడవుల కు వెళ్లాడమనేది అంతల మింగుడు పడదు. కానీ ఇది నిజంగా జరిగిన కథ. అప్పట్లో అన్నలు ఎలా ఉండేవారు.వారి రచనలు,మాటలు ఎంతో మంది ని ఇన్ స్పైర్ చేశాయో అప్పటి పరిస్థితులు తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తాయి. సినిమా స్లో గా ఉండటం,కమర్షియల్ హంగులు లేకపోవడం వల్ల కొందరికి యావరేజ్ అనిపిస్తుంది. కానీ ఒక నిజమైన ప్రేమను ఇలాంటి పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ లో చెప్పడం అనేది ఛాలెంజ్ యే. ఆ విషయం లో డైరెక్టర్ వేణు పూర్తి గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమాను థియేటర్లకు వచ్చి ఎంత మంది చూస్తారో అనేది చెప్పలేం. ఓవరాల్ గా సినిమా బాగుంది.