ఓటీటీలో దుమ్ములేపుతున్న "వర్జిన్ స్టోరీ"

ఓటీటీలో దుమ్ములేపుతున్న "వర్జిన్ స్టోరీ"

సినిమాల విషయంలో ఆడియన్స్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి భారీ హైప్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్స్, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతూ ఉంటాయి. అంతెందుకు.. థియేటర్ లో ఫ్లాప్ గా నిలిచినా సినిమాలు OTT సూపర్ హిట్లుగా నిలిచినా సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఆ సినిమానే 'వర్జిన్ స్టోరీ'. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. తాజాగా ఇదే సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. అక్కడ ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 21 నుండి 'ఆహా' ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ స్టార్ట్ ఐన కొద్దిరోజుల్లోనే 10 మిలియన్ల వ్యూస్ అందుకొని భారీ రెస్సాన్స్ తో దూసుకుపోతోంది.

ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్పామ్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిన్న సినిమాలలో 'వర్జిన్ స్టోరీ' చేరడం విశేషం. దీంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ సాహిదేవ్ హీరోగా నటించాడు. సౌమిక పాండ్యన్, రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష లగడపాటి, శ్రీధర్ లగడపాటి నిర్మించారు. ఆహా ఓటీటీలో 10 మిలియన్ల వ్యూస్ ని అందుకొని రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా..  ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.