
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్జింఖానా గ్రౌండ్లో శనివారం సాయంత్రం మా భాగవతి 21వ విశాల్ జాగరన్ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు బీఎన్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జింఖానా గ్రౌండ్ లో ప్రెస్‌మీట్‌పెట్టి వివరాలు వెల్లడించారు. మా వైష్ణోదేవి జాగరన్ మండల్ ఆధ్వర్యంలో ఏటా వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జమ్మూ నుంచి కట్ర దేవాలయంలోని ప్రధాన అర్చకులు అఖండ జ్యోతి వెలిగించి అమ్మవారి పూజలు ప్రారంభిస్తారని వెల్లడించారు. అంతర్జాతీయ గాయకులు లక్ వీర్ సింగ్ లక్మ ఆధ్వర్యంలో అమ్మవారి కీర్తనలు పాడుతారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.