
ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ మోజులో పడి వీడియోలు తీస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. వారం రోజుల క్రితం ఖమ్మం జిల్లా మున్సిపల్ సిబ్బంది టిక్ టాక్ వీడియోలు తీసి సస్పెన్షన్ కు కూడా గురయ్యారు. గుజరాత్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా వీడియోలు చేసి సస్పెన్షన్‌కు గురైంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోని సిబ్బంది కూడా టిక్ టాక్ లు చేస్తూ టైం పాస్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా విశాఖలోని శక్తి టీమ్స్ కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తూ వార్తల్లోకెక్కారు. మహిళలపై ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు సరి కొత్తగా ఏపీలో ప్రారంభించిన శక్తి టీమ్స్.. విధులు నిర్వహించాల్సిన సమయంలో పోలీసు వాహనాల్లోనే టిక్ టాక్ వీడియోలు చేశారు. వెస్ట్ జోన్ పరిధికి చెందిన ఈ సిబ్బంది నిర్వాకంతో పోలీస్ శాఖకు తలనొప్పులు మొదలయ్యాయి. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.