
ఇటీవల అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలరించాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. తాజాగా తన 11వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. సీనియర్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రానికి ఓకే చెప్పాడు. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్‌పై అర్జున్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ నటిస్తోంది. ఐశ్వర్య అర్జున్‌కి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం, జగపతిబాబు కీరోల్ పోషిస్తున్నాడు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.