
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ కొత్త లుక్ లోకి మారిపోయాడు. తాను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కోసం ఈ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రానున్న ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది.
విశ్వక్ సేన్ కెరీర్ లో 11వ సినిమాగా తెరకెక్కితున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ క్లాప్ కొట్టారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు విశ్వక్.
షార్ట్ హెయిర్ తో, కోరమీసాలతో పక్కా మాసీ అండ్ స్టైలీష్ లుక్ అదిరిపోయేలా ఉన్నాడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభంకానుంది. దసరాకి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాదిలో ఇప్పటికే దాస్ కా ధమ్కీ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విశ్వక్.. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.