కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ పట్టణంలోని విశ్వశాంతి స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు హెచ్ఎం డి.రమేశ్ తెలిపారు. 114 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 81 మంది 500 మార్కులకు పైగా మార్కులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు ఎన్.ఆంజనేయులు, మధు రాజేశ్, ఎ.గిరిధర్ అభినందించారు.

