టామ్ కామ్ బలోపేతం కోసం బడ్జెట్ లో రూ.90 కోట్లు కేటాయించాం: మంత్రి వివేక్ వెంకటస్వామి 

టామ్ కామ్ బలోపేతం కోసం బడ్జెట్ లో రూ.90 కోట్లు కేటాయించాం: మంత్రి వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్ లో నిర్వహించిన కీలక వర్క్ షాప్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం ( మే 20 ) భారత్- యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టామ్ కామ్ ఒక అద్భుతమైన సంస్థ అని...టామ్ కామ్ ద్వారా మంచి శిక్షణ పొందిన విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో టామ్ కామ్ ని మరింత బలోపేతం చేస్తామని...ఇందుకోసం బడ్జెట్లో రూ. 90 కోట్లు కేటాయించామని అన్నారు మంత్రి వివేక్. 

జర్మన్ భాష నేర్చుకున్న వారికి అపారమైన అవకాశాలున్నాయని.. ప్రస్తుతం ఏఐ చాలా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఏఐతో పోటీ పడగల శిక్షణ తీసుకుంటేనే రాణించగలుగుతామని అన్నారు మంత్రి వివేక్. విద్యార్థులకు విదేశాల్లో ఉపాధి కల్పించడానికి మా వంతు కృషి చేస్తామని అన్నారు.

ఈ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ద్వారా మన యువతకు యూరోప్ దేశాల్లో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలపై స్పష్టమైన అవగాహన కలుగుతోందని అన్నారు మంత్రి వివేక్. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కిల్ మొబిలిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. జర్మనీ సహా యూరోపియన్ దేశాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మన యువతను స్కిల్ చేయడం మన లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్.