ఎగ్జిబిషన్ను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి, విజయశాంతి

ఎగ్జిబిషన్ను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి, విజయశాంతి

సికింద్రాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. హెచ్ఐసీసీలో జరిగిన కార్యవర్గ సమావేశానికి హాజరైన జాతీయ నేతలు ఎగ్జిబిషన్ ను సందర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, విజయశాంతి ఎగ్జిబిషన్ ను సందర్శించి ఏర్పాటు చేసిన ఫోటోలను ఆసక్తిగా చూశారు. సమావేశానికి హాజరైన ముఖ్య నాయకులు, ఇతర నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందు ఎగ్జిబిషన్ ను సందర్శించారు. వర్షం కురిసినా నరేంద్ర మోడీ బహిరంగ సభ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా కనివినీ ఎరుగని రీతిలో సమావేశాలు నిర్వహిస్తుండడంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.