
కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడి సందర్భంగా బీజేపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. కంట్రోల్ సెంటర్ కి వచ్చే మార్గాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిని పోలీసులు అడ్డుకున్నారు. రామగుండంలో మోడీ టూర్ ఏర్పాట్లకు వెళ్తున్నానని చెప్పినా వినకుండా.. పోలీసులు వివేక్ వెంకటస్వామితో వాగ్వాదానికి దిగారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకలను అరెస్ట్ చేసి పోలీసులు పీఎస్ కు తరలించారు.
రాష్ట్రలో బీజేపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులు.. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ ముట్టుడికి పిలుపునిచ్చారు. పోలీసులు కూడా TRSకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వటంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు .