ముస్సోరిలో తెలుగు టెకీ రాధాగాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. రాధా గాయత్రీ లాడ్జి రూమ్ లో నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉండటం... తన భార్యను ఎవరో హత్య చేశారంటూ ఆమె భర్త శ్రీచరణ్ ఆరోపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాధా గాయత్రీ పేరెంట్స్ కూడా శ్రీచరణ్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రాధా తమతో మాట్లాడిన లాస్ట్ ఫోన్ కాల్ బయటపెట్టారు ఆమె పేరెంట్స్.
రాధా గాయత్రీ తన లాస్ట్ ఫోన్ కాల్ లో తల్లితో భర్త ప్రవర్తన గురించి చెప్పి వాపోయింది. భర్త ప్రవర్తనతో మనసు పూర్తిగా విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది రాధా గాయత్రి. తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని తల్లికి చెప్పింది. ఇన్నాళ్లు ఓపిక పట్టానని.. అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడని తల్లికి చెప్పి బాధపడింది రాధా గాయత్రి.
