ఎంటర్‌‌‌‌టైన్ చేసే  సౌండ్ పార్టీ

ఎంటర్‌‌‌‌టైన్ చేసే  సౌండ్ పార్టీ

వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వంలో  రూపొందుతోన్న చిత్రం  ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో భువన్ సాలూరు, రవి పోలిశెట్టి నిర్మిస్తున్నారు. ఇటీవ‌‌ల షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్..  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడ‌‌క్షన్ ప‌‌నులతో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌‌‌‌ను శుక్రవారం  ఎమ్మెల్సీ  క‌‌విత లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘పోస్టర్ ఎంతో ఇంటరెస్టింగ్‌‌గా ఉంది.

కాన్సెప్ట్ కూడా  ఎంటర్‌‌టైనింగ్‌గా ఉండ‌‌బోతున్నట్లు టైటిల్ చూస్తే అర్థమ‌‌వుతోంది. ఈ సినిమా  ఘ‌‌న విజ‌‌యం సాధించి టీమ్ అందరికీ  మంచి పేరు రావాల‌‌ని కోరుకుంటున్నా’అన్నారు. అవుట్‌‌పుట్ చాలా బాగా వచ్చిందన్నాడు సన్నీ. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అన్నారు దర్శక నిర్మాతలు. అలీ, సప్తగిరి, శివన్నారాయణ, పృథ్వీ, ఆర్‌‌.జె.హేమంత్  ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.