అన్నాడీఎంకే కీలక పదవిపై కోర్టులో శశికళ పిటిషన్‌

అన్నాడీఎంకే కీలక పదవిపై కోర్టులో శశికళ పిటిషన్‌

పార్టీ అధినేత్రిగా తన స్థానం కోసం శశికళ మళ్ళీ న్యాయ పోరాటం ప్రారంభించారు. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ చెన్నై కోర్టును ఆశ్రయించారు.

2017లో తనను పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవిని ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ… అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్‌ నిర్ణయాన్ని శశికళ అపుడే కోర్టులో సవాలు చేశారు. జైలు నుంచి బైటకు వచ్చాక.. కేసును వెంటనే విచారణకు చేపట్టాలంటూ ఆమె రాష్ట్ర సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో లేటెస్టుగా పిటిషన్‌ దాఖలు చేశారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి చేపట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేలోపే అవినీతి కేసులో జైలుకెళ్లారు. దీంతో పళనిస్వామిని సీఎం అయ్యారు. ఆ తర్వాత పళని, పన్నీర్‌ సెల్వం వర్గాలు కలిసిపోయాయి. తర్వాత పళని, పన్నీర్‌ సెల్వం కలిసి శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.

దీంతో తాజాగా మరోసారి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు శశికళ. దీనిపై మార్చి 15న విచారణ జరగనుంది.