కాలేజీలో కామాంధుడి అరాచకం.. ఏడాదిన్నరగా తోటి విద్యార్థినిపై అత్యాచారం

 కాలేజీలో కామాంధుడి అరాచకం.. ఏడాదిన్నరగా తోటి విద్యార్థినిపై అత్యాచారం
  • డ్రగ్స్​ ఇస్తూ పలుమార్లు లైంగిక దాడి
  • చెయ్యేసిన నిందితుడి ఫ్రెండ్  
  •   బాధితురాలి ఆత్మహత్యాయత్నం
  • ఆలస్యంగా వెలుగులోకి  

జీడిమెట్ల, వెలుగు : బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై తోటి విద్యార్థి ఏడాదిన్నరగా అరాచకానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిర్రా ఆశిష్ తనయ్ (20) అనే స్టూడెంట్.. ఇన్​స్టాగ్రామ్ ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకుని, ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. 2024 అక్టోబర్​లో కాలేజీ గదిలోనే ఆమెపై మొదటిసారి లైంగిక దాడికి పాల్పడగా, కాలేజీ సిబ్బంది అతడిని పట్టుకుని డిపార్ట్​మెంట్ హెడ్ దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో మరింత రెచ్చిపోయిన ఆశిష్ తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు చూపిస్తూ ఏడాదిన్నరగా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరోగ్యం సరిగాలేదని చెప్పినా వినకుండా కాలేజీ తరగతి గదులతో పాటు హోటళ్లు, ఇంటర్న్​షిప్ పేరుతో కడపకు తీసుకెళ్లి మరీ అఘాయిత్యాలు చేశాడు. డార్క్ వెబ్ ద్వారా మత్తుమందు చాక్లెట్లు తెప్పించి, అవి గర్భనిరోధక మాత్రలని నమ్మించి ఆమెకు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడు. చివరకు నిందితుడి స్నేహితుడు ప్రవీణ్ కూడా ఇటీవల బాధితురాలి ఆధార్ కార్డు, హాల్ టికెట్లు తీసుకుని అఘాయిత్యానికి యత్నించడం, కాలేజీ నుంచి సపోర్టు లేకపోవడంతో తట్టుకోలేక బాధితురాలు ఇంట్లో ఆత్మహత్యకు యత్నించింది.

ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. దీంతో ఆశిష్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని విచారించగా.. నిందితుడు హాష్ ఆయిల్​అన్యూక్రియేషన్స్​అనే సంస్థ ద్వారా డార్క్​ వెబ్​లో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడట్టు అనుమానిస్తున్నారు. డ్రగ్స్​తోపాటు హ్యూమన్​ ట్రాఫికింగ్​ముఠాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.