సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాలి : షాద్ నగర్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి

సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాలి : షాద్ నగర్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి
  • విష్ణు వర్ధన్ తరఫున జబర్దస్త్ ఫేమ్ కొమురం ప్రచారం

షాద్​నగర్,వెలుగు: ప్రజల ఆశీస్సులతో పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి బాగుంటాడని, త్వరలోనే ఆరోగ్యంగా తిరిగొస్తాడని జబర్దస్త్ ఫేమ్ కొమురం అలియాస్ కొమురక్క తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్​నగర్ సెగ్మెంట్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి విష్ణు వర్ధన్ రెడ్డి గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సిటీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  విష్ణువర్ధన్ తరఫున జబర్దస్త్ ఫేమ్ కొమురం మంగళవారం నందిగామ మండలంలోని మామిడి పల్లి, మజీద్ మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, ఇదులపల్లి, మోత్కుల గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు.

ఈ సందర్భంగా కొమురం మాట్లాడుతూ విష్ణు వర్ధన్ రెడ్డిని ఆదరించి అసెంబ్లీకి పంపితే ప్రభుత్వ పనులే కాకుండా ప్రత్యేకంగా మరో 12 పథకాలతో మీ మధ్యలో ఉంటాడన్నారు. ఏ అధికారం లేకుండానే చాలా సేవ కార్యక్రమాలు చేశాడని, ప్రజలు అధికారం ఇస్తే మరింత రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాడని పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చేగు సుధాకర్,మోహన్ సింగ్, ఇస్నాతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.