తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న వీఆర్ఏలు

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న వీఆర్ఏలు

సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ లో వీఆర్ఏలు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తా నుంచి అత్తాపూర్ RDO కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బోనాలు, పోతురాజుల వేషధారణలో VRA లు నిరసన తెలియజేశారు. ఇందులో వందలాది మంది VRAలు పాల్గొన్నారు. గత 29 రోజులుగా తమ‌ న్యాయమైన‌ డిమాండ్లు పరిష్కరించాలని రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన తెలిపినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని చెప్పారు. 

 ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి ఇలాగే కొనసాగిస్తే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించిన జీవోలను వెంటనే అమలు చేయాలని VRAల సంఘం డిమాండ్ చేసింది.