ఫుడ్ పాయిజన్ తో 27 మంది స్టూడెంట్లకు అస్వస్థత..వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ స్కూల్ లో ఘటన

ఫుడ్ పాయిజన్ తో  27 మంది స్టూడెంట్లకు అస్వస్థత..వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ స్కూల్ లో ఘటన

వర్ధన్నపేట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 27 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ల్ లోని స్టూడెంట్లు ఆదివారం ఉదయం చపాతి, మధ్యాహ్నం చికెన్ బగార రైస్, రాత్రి బెండకాయ టమాట, సాంబార్ తిన్నారు.

 అనంతరం స్టూడెంట్లకు వాంతులు, విరేచనాలు కావడంతో గమనించిన సిబ్బంది మందులు ఇచ్చారు. సోమవారం ఉదయమైనా తగ్గకపోవడంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న వరంగల్​జడ్పీ సీఈవో రాంరెడ్డి, వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్​సాగర్, డీటీడీవో నారాయణరెడ్డి స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ ను తనిఖీ చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాస్పిటల్ కు వచ్చి స్టూడెంట్లతో మాట్లాడారు.

 హాస్టల్ ను సందర్శించిన ఆయన డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, హాస్టల్ లో వాటర్ శాంపిల్ ను సేకరించినట్లు చెప్పారు. బీజేపీ మండల అధ్యక్షుడు అడుప రాజు సైతం స్టూడెంట్లను పరామర్శించారు.