భూముల రీసర్వేను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి : వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ సత్య శారద

భూముల రీసర్వేను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి :  వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ సత్య శారద

కాశీబుగ్గ, వెలుగు: భూముల రీసర్వే పనులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్​సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూముల రీసర్వే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వే విధి-విధానాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతి, లైసెన్స్ సర్వేయర్ల బాధ్యతలపై సమగ్రంగా ఆమె సమీక్షించారు.  లైసెన్స్ సర్వేయర్లకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యతతో వ్యవహరించి, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 

ఈ సర్వేలో నిరంతర నిర్వహణ రిఫరెన్స్ స్టేషన్లు (కోర్సు), క్వాంటం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (క్యూజీఐఎస్​)వంటి సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితమైన రికార్డులు రూపొందించాలన్నారు. అనంతరం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితులపై రివ్యూ చేశారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాలు ఆలస్యమైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.సంధ్యారాణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం.శ్రీనివాసులు, డిప్యూటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఎం.రాజేంద్రచారి, జడ్పీ సీఈవోరాంరెడ్డి, డీఏవో విజయ్ భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.