హనుమకొండ: హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి...బ్లాక్ స్పాట్లను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత

హనుమకొండ: హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి...బ్లాక్ స్పాట్లను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత

హనుమకొండ/జనగామ వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించాలని సీపీ శ్వేత సూచించారు. గురువారం పోలీస్ ఆఫీసర్లు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రోడ్ ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో కలిసి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-హైదరాబాద్ హైవేపై కరుణాపురం నుంచి జనగామ జిల్లా పెంబర్తి వరకు బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఈ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10కి పైగా బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు అధికారులు వివరించగా.. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సీపీ సూచనలు చేశారు. హైవేపై అప్రోచ్ రోడ్లు, డివైడర్ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న  చోట రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులను పెట్టాలన్నారు. 

రోడ్డు వెంట ఉన్న వైన్స్ షాపుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎక్సైజ్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మండల పరిధి కరుణాపురం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ఏఐ ఆఫీసర్లకు సూచించారు. సీపీ వెంట వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఘన్ పూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్హెచ్ ఏఐ  పీడీ భరద్వాజ్, మేనేజర్ లింగయ్య, సీఐలు వేణు, చేరాలు, ఎస్సైలు నవీన్ కుమార్, శ్రవణ్ కుమార్, ఇతర శాఖల అధికారులున్నారు.