వరంగల్ నిట్ ముగిసిన స్ప్రింగ్ స్ప్రీ  

వరంగల్ నిట్ ముగిసిన స్ప్రింగ్ స్ప్రీ  

హనుమకొండ, వెలుగు: వరంగల్ నిట్ లో రెండు రోజుల పాటు సాగిన స్ప్రింగ్ స్ప్రీ-2026 వేడుకలు ముగిశాయి. శనివారం రెండో రోజు వివిధ ఈవెంట్లతో విద్యార్థులు సందడి చేయగా, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ స్టంట్ షోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. రైడర్లు బైకులతో స్టంట్లు చేయగా, మిగతా స్టూడెంట్లు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

మరోవైపు విద్యార్థులతో ఉత్కంఠను రేకెత్తించేలా నిర్వహించిన ట్రెజర్ హంట్, మాక్ పార్లమెంట్, ఓపెన్ మైక్ తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్ప్రింగ్ స్ప్రీ వేడుకల ముగింపు సందర్భంగా ప్రోషో లో భాగంగా ప్రముఖ గాయని రణీనా రెడ్డి తన పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. శనివారం రాత్రి జరిగిన కొరియో నైట్ లో విద్యార్థుల డీజే డ్యాన్సులతో స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ముగిశాయి.