విధి నిర్వహణ లో రాణిస్తే గుర్తింపు : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

విధి నిర్వహణ లో రాణిస్తే గుర్తింపు : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

వరంగల్, వెలుగు: విధి నిర్వహణలో రాణించే సిబ్బందికి శాఖా పరంగా గుర్తింపుతోపాటు రివార్డులు వస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సోమవారం కమిషనరేట్ ఆఫీస్​లో పోలీస్ సిబ్బంది శాఖ పరమైన సమస్యలపై పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో సీపీ సిబ్బందితో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిజాయితో పనిచేయాలన్నారు. ఏదైనా శాఖా పరమైన, వ్యక్తిగత సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.