బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

హసన్ పర్తి, వెలుగు : బాల్యవివాహాలను చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. బుధవారం బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్టీవో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని వరంగల్ కమిషనరేట్ ఆఫీస్​లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన మనందరి బాధ్యత అని, ఇందుకోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అడిషనల్ డీసీపీ రవి, ఏహెచ్ టీయూ ఇన్​స్పెక్టర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.