ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధి : కాంగ్రెస్ అభ్యర్థి గరిగే శోభారాణి

ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధి : కాంగ్రెస్ అభ్యర్థి గరిగే శోభారాణి
  •  5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గరిగే శోభారాణి 

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో సుల్తానాబాద్ మున్సిపల్ 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి గరిగే శోభారాణి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 5వ వార్డులో ఆమె కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ శోభారాణి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ దంపతులకు వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు పరిధిలోని పాత జెండా నుంచి ఇందిరానగర్ మీదుగా గట్టేపల్లి క్రాసింగ్ వరకు రోడ్డు నిర్మించిన ఘనత ఎమ్మెల్యే విజయ రమణారావుదేనని అన్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.