నల్లబెల్లి, వెలుగు: క్షణికావేశంలో సొంత బాబాయిని కర్రతో కొట్టి చంపిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచినపల్లికి చెందిన ముసుకుల సాంబరెడ్డి(57) అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అవివాహితుడైన సాంబరెడ్డి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని అన్న కొడుకు రాజు శనివారం అర్ధరాత్రి బాబాయితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో రాజు కర్రతో దాడి చేయగా, తీవ్రగాయాలతో సాంబరెడ్డి స్పాట్లోనే చనిపోయాడు. ఘటన జరిగాక సాంబరెడ్డి డెడ్‌బాడీని ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టేందుకు యత్నించగా, ఇరుగుపొరుగు వారు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రణధీర్‌రెడ్డి స్పాట్‌కు చేరుకొని కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
