
హైదరాబాద్ : ఆర్డీఎస్ దగ్గర కుడి కాల్వకు ఏపీ ముగ్గు పోసిందని.. చుక్క నీరు పోయినా యుద్ధాలు జరుగుతాయన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఆదివారం గాంధీ భవన్ లో మాట్లాడిన సంపత్… జీవోలను ఏపీ రద్దు చేసుకునేలా… తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. అలంపూర్ ను ఎండబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. వాటాలో నీటి బొట్టు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమన్నారు సంపత్.