25 నిమిషాలు.. ఏసీ లేదు.. లైట్లు లేవు.. విమానంలో నరకం

25 నిమిషాలు.. ఏసీ లేదు.. లైట్లు లేవు.. విమానంలో నరకం

అది ఇండిగో ఎయిర్ లైన్స్.. గుజరాత్ లోని వడోదర నుంచి ఢిల్లీ వెళుతున్న ఫ్లయిట్.. ప్రయాణికులు అందరూ ఎక్కేశారు.. విమానంలోని సీట్లన్నీ నిండాయి.. 2026, మే 17వ తేదీ రాత్రి 8 గంటల 80 నిమిషాలు.. విమానం మరికొన్ని నిమిషాల్లో బయలుదేరాల్సి ఉంది. అందరూ సిద్ధంగా ఉన్నారు. విమానం తలుపులు మూసివేశారు. సరిగ్గా ఈ సమయంలో ప్రయాణికులకు నరకం కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వడోదర నుంచి ఢిల్లీ వెళుతున్న ఈ విమానం రన్ వేపై గాల్లోకి ఎగరటానికి సిద్ధంగా ఉన్న సమయంలో.. విమానానికి సంబంధించిన గ్రౌండ్ పవర్ యూనిట్.. GPU ఫెయిల్ అయ్యింది. దీంతో విమానంలో ఏసీ ఆఫ్ అయ్యింది.. లైట్ ఆఫ్ అయ్యాయి. రెండు, మూడు నిమిషాలు కాదు.. ఏకంగా 25 నిమిషాలు. ప్రయాణికులకు గాలి ఆడలేదు.. లైట్లు లేకపోవటంతో చీకట్లు.. దీంతో ప్రయాణికులే మొబైల్స్ లోని కెమెరా ఫ్లాష్ ఆన్ చేశారు. 25 నిమిషాలపాటు విమానంలో ఏసీ లేకపోవటంతో ఉక్కబోతతో.. గాలి ఆడక నరకం చూశాం అని చెబుతున్నారు ప్రయాణికులు. 

►ALSO READ | ఫార్చ్యూనర్ కారు, కోటి కట్నం.. పెళ్లయిన 14 నెలలకే యువతి ఆత్మహత్య.. భర్త, మామ అరెస్ట్!

రాత్రి 8 గంటల 50 నిమిషాలకు ఏసీ, లైట్లు ఆఫ్ అయితే.. 9 గంటల 15 నిమిషాలకు మళ్లీ వచ్చిందని.. ఈ 25 నిమిషాలు దారుణమైన అనుభవాన్ని చూశాం అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రయాణికులు.

ఎయిర్ పోర్టులోని రన్ వేపైనే పరిస్థితి ఇలా ఉంటే.. అదే విమానం గాల్లో ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఏంటీ అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ సప్లయ్ లో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని.. 25 నిమిషాల తర్వాత ఏసీ, లైట్లు ఆన్ అయ్యాయని.. ఆ తర్వాత విమానం బయలుదేరి ఢిల్లీకి వెళ్లిందని చెబుతున్నారు అధికారులు.