దీపావళి రోజు ఇవి చూస్తే మీ అదృష్టమే మారిపోతుంది...

 దీపావళి రోజు ఇవి చూస్తే మీ అదృష్టమే మారిపోతుంది...

Diwali 2023: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకల కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ నెల 12న దీపావళి. ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వాసం ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. దీపావళి రోజున ఇంట్లో దీపాలే కాకుండా మట్టి దీపాలు కూడా వెలిగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజు కొన్ని  జంతువులను చూస్తే లక్ష్మి దేవి ప్రత్యేక అనుగ్రహం మీకు లభిస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆవు:

 హిందూ మతంలో  శకున శాస్త్రం ప్రకారం ఆవుకి తల్లి హోదా ఉంటుంది. దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవును చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆవును దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు. దీపావళి రోజున దాని దర్శనం శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. జ్యోతిష్యంలో శకున శాస్త్రం ఒక భాగం. శకున శాస్త్రం ప్రకారం, చిన్న చిన్న విషయాలు కూడా మన భవిష్యత్తు గురించి చాలా చెబుతాయి.దీపావళి రోజున ఈ రంగులో ఉన్న ఆవును చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం, సంపదలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

బల్లులు..

బల్లులంటే భయంతో పరిగెత్తెవారు చాలా మంది ఉన్నారు. బల్లులు సాధారణంగా ఇంట్లో కనిపిస్తాయి . అయితే దీపావళి రోజు ఇంట్లో బల్లిని చూస్తే చాలా మంచిదని మీకు తెలియని విషయం ఒకటి ఉంది. జ్యోతిష్యం ప్రకారం, దీపావళి రోజున బల్లిని చూడటం లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచన.  కానీ దీపావళి రోజు రాత్రి గణేష్-లక్ష్మీ పూజ తర్వాత బల్లి కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీపావళి రోజున బల్లిని చూడటం లక్ష్మీదేవి ఆనందానికి సూచికగా శకున శాస్త్రం చెబుతోంది.

గుడ్లగూబ..

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అందువల్ల గుడ్లగూబ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఎక్కడో గుడ్లగూబ కనిపిస్తే మీ అదృష్టం వరిస్తుంది.దీపావళి సందర్భంగా మీకు కలలో గుడ్లగూబ కనిపిస్తే, అది జీవితంలో ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది. అయితే, కలలో గుడ్లగూబ దూరంగా వెళుతున్నట్లు కనిపిస్తే, అది ఆర్థిక నష్టానికి సంకేతం.

ఎలుక:

దీపావళి రోజు రాత్రి ఎలుక కనిపిస్తే సంతోషించాల్సిందే. శకున శాస్త్రం ప్రకారం, ఎలుక దర్శనం డబ్బు రాకకు సూచిక. దీపావళి రోజు ఎలుక కనిపిస్తే తరిమికొట్టకూడదు.

పిల్లి:

 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దీపావళి రోజున పిల్లిని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పిల్లిని చూడటం ద్వారా మీ ఇంటిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.