హిమాయత్ సాగర్ కు పెరుగుతున్న వరద... దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాటర్బోర్డు సూచన

హిమాయత్ సాగర్ కు పెరుగుతున్న వరద... దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాటర్బోర్డు సూచన

హైదరాబాద్​సిటీ, వెలుగు: హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​పరివాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్​సాగర్​లోకి 400 క్యూసెక్కుల  వరద చేరి, నీటిమట్టం పెరుగుతోంది. 

అవసరమైతే గేట్లు ఎత్తి  వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని వివిధ ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు, జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటర్​బోర్డు సూచించింది. 

హిమాయత్​సాగర్​పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,761.15 అడుగులకు చేరింది. ఉస్మాన్​సాగర్​పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1784.35 అడుగులకు చేరింది.