స్కూల్ యూనిఫాంలు లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..28 లక్షల మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 56 లక్షల యూనిఫాంలు

స్కూల్ యూనిఫాంలు లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..28 లక్షల మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 56 లక్షల యూనిఫాంలు
  • ఇంకా ఖరారు కాని టెండర్లు
  • రోజుకు లక్ష జతలు కుట్టే సామర్థ్యమున్నా అందని క్లాత్
  • టెస్కో నుంచి మహిళా సంఘాలకు చేరింది కొంతే
  • స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దుస్తులు అందేందుకు మరో రెండు నెలల సమయం?

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం ఉచితంగా అందజేయాల్సిన యూనిఫాంలు ఇంకా అందలేదు. యూనిఫాంలు, షూ, పెట్టెలు (ట్రంక్ బాక్సులు) తదితర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం పిలిచిన టెండర్లు ఇంకా ఫైనల్ కాలేదు. టెండర్లు ఖరారైన తర్వాతే ఏజెన్సీలు క్లాత్ సరఫరా చేస్తాయి. ఆ తర్వాత మహిళా సంఘాలు యూనిఫాంలు కుట్టి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపిణీ చేయడానికి ఇంకా రెండు నెలలు పట్టొచ్చని అధికారులు అంటున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో కలిపి మొత్తం 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున మొత్తం 56 లక్షల జతల స్కూల్ యూనిఫాంలు అందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రోజుకు లక్ష జతల యూనిఫాంలు కుట్టే సామర్థ్యం ఉంది. అయితే పూర్తి స్థాయిలో వారికి క్లాత్ అందకపోవడంతో, తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) ఇచ్చిన కొద్దిపాటి క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ప్రస్తుతం కొన్ని యూనిఫాంలు కుడుతున్నారు.

టెస్కోకు సవాల్

గురుకుల టెండర్లపై టెస్కో గతంలో హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ సంస్థ అయిన తమకు అవకాశం ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకు ఆర్డర్లు అప్పగిస్తున్నారని పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. దీనిని విచారించిన హైకోర్టు.. టెస్కో నుంచి కూడా స్కూల్ యూనిఫాంల క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేకరించాలని ఆదేశించింది. ఆ తర్వాత టెస్కో కొంత క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మహిళా సంఘాలకు సరఫరా చేసింది. అయితే.. తక్షణమే భారీ మొత్తంలో క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం టెస్కోకు లేనట్లు సమాచారం. పైగా గతేడాది సరఫరా చేసిన దుస్తులకు సంబంధించిన క్లాత్ బకాయిలను ప్రభుత్వం ఇంకా పూర్తిగా చెల్లించలేదని టెస్కో అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దీనివల్ల కొత్త ఆర్డర్లకు తగ్గట్టుగా క్లాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించడం టెస్కోకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడం, క్లాత్ కొరత ఉండడంతో.. ఈ ప్రక్రియ అంతా పూర్తయి విద్యార్థుల చేతికి డ్రెస్సులు అందేసరికి మరో 2 నెలలు పట్టేలా కనిపిస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి, బకాయిలు విడుదల చేయడం ద్వారా విద్యార్థులకు త్వరగా యూనిఫాంలు అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.