హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరంలో రాత్రి నీటి సరఫరా జరిగే ప్రాంతాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయానుసారంగా నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంగళవారం ఎస్పీఆర్ హిల్స్‌లో నిర్మిస్తున్న పైపులైన్ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి ఉగాది నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
