నీళ్ల దొంగలను పట్టుకున్నారు.. నల్లాలకు బిగించిన 22 మోటార్లు సీజ్

నీళ్ల దొంగలను పట్టుకున్నారు.. నల్లాలకు బిగించిన 22 మోటార్లు సీజ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నల్లాలకు మోటార్లను బిగించి నీటిని తోడేస్తున్న వారి పని పడుతోంది వాటర్​బోర్డు.  మంగళవారం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో కొండాపూర్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీ, ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేసి నల్లాలకు బిగించిన 22 మోటార్లను స్వాధీనం చేసుకుంది. తక్కువ ప్రెషర్​తో నీళ్లు వచ్చినా, సరఫరాలో సమస్యలు తలెత్తినా 155313 నంబర్​కు ఫోన్​ చేయాలన్నారు.