నదిలో రెస్క్యూ ఆపరేషన్స్ పై శిక్షణ

నదిలో రెస్క్యూ ఆపరేషన్స్ పై శిక్షణ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని బ్రిడ్జి సమీపంలో ముదిరాజ్‌‌, బెస్త కులస్తులకు నదిలో బోట్‌‌ డ్రైవింగ్‌‌, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్, ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్‌‌‌‌లలో శిక్షణ కార్యక్రమాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ ఆదివారం ప్రారంభించారు. అడ్వెంచర్స్ అండ్ ఆక్వా టూరిజం చైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో 20 మందికి 10 రోజులపాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా గోదావరిఖనిలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు మంజూరైన వివిధ రకాల చెక్కులను అందజేశారు. 39వ డివిజన్‌‌ ‌‌గౌతమీనగర్‌‌‌‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చౌరస్తాను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మేయర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ బంగి అనిల్‌‌కుమార్‌‌‌‌, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు, లోకల్‌‌ లీడర్లు పాల్గొన్నారు.