
అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలని ఆకాక్షించారు ఈనాడు సంస్థల ఎండీ సీహెచ్ కిరణ్. విజయవాడలోని కానూరులో రామోజీ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా రామోజీరావు సూచించినట్లుగా కిరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం ప్రకటిస్తున్నామని కిరణ్ తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పుకొచ్చారు. ఈ సభను ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి రామోజీరావు ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా దీనిని భావిస్తున్నామని కిరణ్ అభిప్రాయపడ్డారు.