మేమేం గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగబాబు ట్వీట్‌పై విరుచుకుపడ్డ ప్రకాశ్ రాజ్!

మేమేం గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగబాబు ట్వీట్‌పై విరుచుకుపడ్డ ప్రకాశ్ రాజ్!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, సమాజంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. సమకాలీన రాజకీయాలపై, ముఖ్యంగా పాలకుల నిర్ణయాలపై నిర్మొహమాటంగా గళమెత్తే ఆయన.. లేటెస్ట్ గా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పెట్టిన ఒక పోస్ట్‌పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..?

రీసెంట్‌గా నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. 'నాయకుడికి అన్నీ తెలుసు.. ఆయన మాటే శాసనం. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, ప్రశ్నించకుండా నాయకుడి మాటను అనుసరించండి' అంటూ జనసైనికులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో పవన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నాగబాబు ఈ పోస్ట్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది.

ప్రకాశ్ రాజ్ రియాక్షన్..

నాగబాబు చేసిన ఈ 'బ్లైండ్ ఫాలోయింగ్' కామెంట్‌పై ప్రకాశ్ రాజ్ అంతే స్పీడ్‌గా, అంతే ఘాటుగా స్పందించారు. మీ సందేహాలను పక్కనపెట్టండి.. మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.. ఇలాంటి బెదిరింపు ధోరణులు మా దగ్గర వద్దు. ప్రశ్నించడం అనేది పౌరుడిగా మా ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా, నేనే సుప్రీం అనుకునే ఏ లీడరైనా సరే.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే, బాధ్యత వహించాల్సిందే అంటూ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు.

ALSO READ : ‘పెద్ది’ 2 డేస్ కలెక్షన్స్: థియేటర్లలో మెగా మాస్ జాతర..

నెట్టింట 'వర్డ్ వార్'

గతంలో మా ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత సనాతన ధర్మం వివాదంలోనూ పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అప్పట్లో నాగబాబు కూడా ప్రకాశ్ రాజ్‌కు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఒకవైపు జనసేన శ్రేణులు నాగబాబు పోస్ట్‌ను సమర్థిస్తుంటే.. మరోవైపు నెటిజన్లు మాత్రం ప్రకాశ్ రాజ్ అడిగిన దాంట్లో తప్పేముంది? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హీట్ పెంచేస్తోంది.