శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ హీరోయిన్. గత వారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ మీట్‌ను మంగళవారం నిర్వహించారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘థియేటర్ నుంచి వచ్చాక కూడా మనల్ని వెంటాడే చిత్రాలు అరుదు. అలాంటి సినిమానే ‘శ్వాగ్’. ఇలాంటి కొత్త కథలు ట్రై చేస్తూ, రిస్క్ చేయకపోతే తర్వాతి తరాన్ని మనం ఇన్ స్పైర్ చేయలేం. నాకు మంచి గుర్తింపును ఇచ్చిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునే క్రమంలో ఇలాంటి గొప్ప కథలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను’ అని చెప్పాడు. డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌తో మా రెండున్నర ఏళ్ల కష్టాన్ని మర్చిపోయాం. రాసేటప్పుడు, తీసేటప్పుడు బోల్డ్ కంటెంట్ అనుకోలేదు. కానీ చూసిన వాళ్లంతా బోల్డ్ కంటెంట్ అనడం కిక్ ఇచ్చింది’ అని అన్నాడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. త్వరలో శ్రీవిష్ణు హీరోగా ఓ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే హసిత్ డైరెక్షన్లో వచ్చే ఏడాది మరో సినిమా చేయబోతున్నాం’ అని చెప్పారు. హీరోయిన్ దక్షా నగార్కర్, ఎడిటర్ విప్లవ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
‘శ్వాగ్’ కంటెంట్ విషయంలో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాం
- టాకీస్
- October 10, 2024
మరిన్ని వార్తలు
-
Vikkatakavi: ఊహకు అందని ట్విస్ట్‌లతో డిటెక్టివ్ థ్రిల్లర్ 'వికటకవి' వెబ్‌సిరీస్ ట్రైలర్..స్ట్రీమింగ్ డేట్ ఇదే
-
GhaatiGlimpse: మహిళ సాధికారతపై క్రిష్ సినిమా.. అనుష్క పాత్ర వేదంని మించి!
-
బ్రేకింగ్: షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కంగారుపడొద్దంటూ ఇన్‌స్టా పోస్ట్
-
SamanthaRuthPrabhu: ఆ సమంత ఎక్కడ?.. అలా మా కోసం మళ్లీ రావాలి!
లేటెస్ట్
- పసికందును కిడ్నాప్‌కు యత్నించిన మహిళ అరెస్ట్..కోఠి ప్రసూతి ఆస్పత్రిలో ఘటన
- రైతుల బాగు కోసమే మూసీ ప్రక్షాళన:మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు ఆటమ్ బాంబ్ పేలబోతుంది: మంత్రి పొంగులేటి
- హైదరాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం
- WPL 2025: ఆర్సీబీతోనే మంధాన.. మహిళల రిటెన్షన్ జాబితా విడుదల
- ఖమ్మంలో కొత్తగా రిక్రూట్ అయిన హిందీ పండిట్ల తొలగింపు.. అదీ 24 రోజులు డ్యూటీ చేశాక..
- గుత్తాధిపత్యానికి నేను వ్యతిరేకం..వ్యాపారానికి కాదు: రాహుల్ గాంధీ
- IND vs AUS: కుటుంబ బాధ్యతలు మీకేం తెలుసు.. గవాస్కర్‌పై ఫించ్ ఆగ్రహం
- Australia Social Media ban: పేరెంట్స్ కళ్లలో ఆనందం కోసం.. అక్కడ టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధం
- కేటీఆర్‌కు కిషన్ రెడ్డి కౌంటర్.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనే వ్యాఖ్యలపై..
Most Read News
- నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు.
- WI vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలో మైదానాన్ని వీడిన బౌలర్
- గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు ..ఒకే రోజు ఇంత తగ్గడం ఇదే మొదటిసారి
- బెంగళూరులో షాకింగ్ ఘటన.. ఎటు పోతోంది సమాజం.. పదేళ్ల పిల్లాడు కూడానా..!
- శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం..
- సీఎంపై కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వలేం
- మాదాపూర్ లో స్ట్రీట్ వెండర్స్ఆందోళన.. ఎందుకంటే..
- హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
- IND vs SA: రేపటి నుంచే సఫారీలతో టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- త్వరలోనే కొత్త వరంగల్ చూడబోతున్నాం