రెడీగా ఉన్నాం.. రండి చూస్కుందాం...! అమెరికాకు ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిలిటరీ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రెడీగా ఉన్నాం.. రండి చూస్కుందాం...! అమెరికాకు ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిలిటరీ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/టెహ్రాన్: అమెరికా సైనికులు భూతల దాడులకు ప్రయత్నిస్తే వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తెలిపింది. ఈ మేరకు తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ అధికారిక మీడియా ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీ ప్రసారం చేసిన ఈ 59 సెకన్ల వీడియోలో, ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండోలు యుద్ధ విన్యాసాలు చేస్తూ కనిపించారు. ‘‘మేము రెడీగా ఉన్నాం.. మీ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ ఆ వీడియోలో హెచ్చరించారు. 

ఇందులో ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి యుద్ధ సామగ్రితో విన్యాసాలు చేయడం, భారీ క్షిపణి వాహనాల నుంచి రాకెట్లను ప్రయోగించడం వంటివి చేస్తున్నాయి. మరోవైపు, వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ ఎపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యూరీ లక్ష్యాలను సాధించడంపై ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా దృష్టి పెట్టారని తెలిపారు. 

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇది పూర్తిస్థాయి దండయాత్ర కాకపోవచ్చని సమాచారం. కేవలం ఆ దేశంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మెరుపు దాడులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.