
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలకు 150.17 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శనగలు, మినుములు, జొన్న, పొద్దు తిరుగుడు రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయిందని పేర్కొన్నారు. మద్దతు ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలలో స్పష్టత కరువైందని చెప్పారు. పరిమిత పంటలకే కేంద్రం మద్దతు ధర ఇస్తోందని వెల్లడించారు. మిగిలిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందని తెలిపారు.