జనగణనలో భాగస్వాములు కావాలి.. మెదక్ లో అవగాహనకోస్ మారథాన్

జనగణనలో భాగస్వాములు కావాలి.. మెదక్ లో అవగాహనకోస్ మారథాన్

మెదక్​టౌన్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్​ కలెక్టర్​ప్రతిమాసింగ్​ కోరారు. జనగణనపై అవగాహన కల్పిస్తూ సోమవారం మెదక్​ పట్టణంలోని రాందాస్​ చౌరస్తా నుంచి పోస్టాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణనలో భాగంగా ఇంటింటి సందర్శనలో ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు. 

అనంతరం జనగణన ట్యాబ్​లను ఆవిష్కరించారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని... రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవీ వ్యాక్సిన్, ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు, సీఎస్ఆర్​ నిధులు, ఉపాధి హామీ పథకం అమలుపై అధికారులతో రివ్యూ చేశారు. 

అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో అంబదాస్​రాజేశ్వర్​, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో శ్రీరామ్, డీఐవో మాధవి, మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధిక  పాల్గొన్నారు.