తొగుట (దుబ్బాక) వెలుగు : చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని చేనేత పరిశ్రమను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ... గొల్లభామ చీరలు నేసిన గొప్ప ప్రాంతం దుబ్బాక అని చెప్పారు. అనంతరం నియోజకవర్గ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలను కాంగ్రె ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు. అలాగే మిరుదొడ్డి మండలం కొండాపూర్ లో అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
