న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి.. బీజేపీ పాలనలో ప్రలోభాలకు గురవుతుంది: మధుయాష్కీ గౌడ్

న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి.. బీజేపీ పాలనలో ప్రలోభాలకు గురవుతుంది: మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: బీజేపీ పాలనలో ప్రలోభానికి గురవుతున్న న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రెండోసారి గెలిచిన సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ విజయోత్సవ సభ నిర్వహించారు.

 దీనికి హాజరైన మధు యాష్కీ..వెంకట్ యాదవ్ ను సన్మానించారు. ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, పాలమూరు వర్సిటీ వైస్ చాన్స్ లర్ శ్రీనివాస్, స్టేట్ పోలీస్ కంప్లయింట్​అథారిటీ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, అఖిల భారత యాదవ సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.