బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు త‌ట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా అడ్డుకున్నం : కేటీఆర్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు త‌ట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా అడ్డుకున్నం : కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. బీజేపీతో, కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కై సింగరేణి గనులను వేలం వేశారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు త‌ట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా అడ్డుకున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారు. స‌కల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని చెప్పారు.

  సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమైనయ్. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయని హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పని చేశాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది బీఆర్ఎస్ పార్టీ విధానమని ఉద్యమ కాలం నుంచి…ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే మా విధానమని చెప్పారు.