‘డాక్టర్ అయుండి పెట్రోల్ బాటిల్ తో హంగామా చేశాడు’

‘డాక్టర్ అయుండి పెట్రోల్ బాటిల్ తో హంగామా చేశాడు’

బాధ్యతాయుతమైన డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆసుపత్రి ఎదుట పెట్రోల్ బాటిల్ తో హంగామా చేసిన డాక్టర్ వసంత్ పై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని గాంధీ హాస్పిటల్  DME రమేష్ రెడ్డి అన్నారు.

కరోనా అనుమానాలతో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారి కేసుల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తప్పుడు వార్తలు వచ్చాయి. దీనికి బాధ్యునిగా భావిస్తూ డాక్టర్ వసంత్ కుమార్ ను సరెండర్ చేసింది మేనేజ్ మెంట్. అయితే కారణం లేకుండా తనను సరెండర్ చేశారని ఆరోపిస్తూ వసంత్ కుమార్ పెట్రలో బాటిల్ తో హల్ చల్ చేశాడు.

ఈ ఘటన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన DME రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోన వైరస్ పై గాంధీ ఆసుపత్రిలో మీటింగ్ జరుగుతుంటే…. డాక్టర్ వసంత్ అనుమతి లేకుండా మీటింగ్ లోకి వెళ్లి గొడవ చేశాడన్నారు. ఆ గొడవ తో మీటింగ్ లో ఉన్న డాక్టర్లు, RMO , సూపరింటెండెంట్ తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు పరిశీలించి అతన్ని  సరెండర్ చేశామన్నారు.

ఆసుపత్రిలో పేషేంట్ లను వసంత్ ఇబ్బందులకు గురిచేశాడని, వారిని భయపెడుతూ…బ్లాక్ మెయిల్ చేశాడన్నారు రమేష్ రెడ్డి. తన తప్పు బయటపడడంతో అనవసరం అవినీతి ఆరోపణలు చేస్తున్నాడని, నాపై అవినీతి ఆరోపణలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశాడని ప్రశ్నించారు DME.

క్రెడిబులిటీ లేని మనిషి డాక్టర్ వసంత్ అని, అతను నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సమాధానం చెప్పలేమని రమేష్ అన్నారు.

action against Dr. Vasanth