బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం: జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం: జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: బీసీల న్యాయ పరమైన వాటా రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే  ఉరుకోబోమని జాతీయ బీసీ సంఘాల అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 

బీసీలకు రావాల్సిన న్యాయపరమైన రిజర్వేషన్లను రెడ్డి సామాజిక వర్గం అడ్డుకోవద్దని, లేనిపక్షంలో రెడ్డి వర్సెస్ బీసీలుగా చీలిపోయి రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గానికి బీసీలు రాజకీయంగా సహకారాన్ని అందజేశారని ఇప్పుడు బీసీలకు సహకరించకపోతే త్వరలో తాము నిర్వహించబోయే మహా బీసీ గర్జన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ‘రెడ్డి హఠావో బీసీ బచావో’ నినాదం వినిపిస్తామని హెచ్చరించారు.