ఖమ్మం బాలికకు అండగా ఉంటాం : గద్వాల విజయలక్ష్మి

ఖమ్మం బాలికకు అండగా ఉంటాం : గద్వాల విజయలక్ష్మి
  • నిమ్స్‌‌‌‌‌‌‌‌లో బాధితురాలికి పరామర్శ

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం ఘటన బాధిత బాలికకు ప్రభుత్వం, మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్‌‌‌‌‌‌‌‌తో పాటు, సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, రాధాభాయ్, ఉజ్మా ఆషయ్ షాకీర్ పరామర్శించారు.

బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. బాలిక ఆరోగ్యపరిస్థితిపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌‌‌‌‌‌‌‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలికకు మెరుగైన చికిత్స అందించాలని గద్వాల విజయలక్ష్మీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి కఠినంగా శిక్షపడేటట్టు చూస్తామన్నారు.