కరోనా తగ్గే వరకు చేన్లలోనే ఉంటాం

కరోనా తగ్గే వరకు చేన్లలోనే ఉంటాం

గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఓకాలనీ ప్రజలు ఇండ్లకు తాళాలు వేసి చేన్లలో షెడ్లు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనా పోయేవరకు తాము ఇండ్లకు వెళ్లమని తేల్చి చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నుంచి మర్కజ్ కు వెళ్లి తిరిగి వచ్చినవారిలో మూడు పాజిటివ్ కేసులున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో నేరడిగొండ మండల కేంద్రంలో ప్రజలు ఇంటిబయటికి రావడంలేదు.ఎవరినీ వారి ఇండ్లలోకి రానివ్వడం లేదు. గ్రామంలో ఓ కాలనీకి చెందిన 50 కుటుంబాల ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి ఆహార పదార్థాలు, అవసరమైన సామగ్రిని ట్రాకర్ట్లతో తీసుకెళ్లి గ్రామ శివారులోని పంట చేలల్లో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ఉంటే ఎవరితోనైనా కరోనా రావచ్చని, అందుకే తాము ఊరికి దూరంగా వచ్చామంటున్నారు. తమ వద్ద ఉన్న వస్తువులను వినియోగిస్తూ తమవద్ద ఉన్న ఆహార పదార్థాల ను వాడుకుంటామని, కరోనా పూర్తి స్థాయిలో తగ్గేవరకు గ్రామంలోకి ఎట్టి పరిస్థితిలో వెళ్లేది  లేదంటూ తెగేసి చెబుతున్నారు.