దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలిపించాలి

దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలిపించాలి

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు చిట్టాపూర్ లో దుబ్బాక టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత ను కలిశారు మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ అభ్యర్థి గా సోలిపేట సుజాతను ప్రకటించారని చెప్పారు. 2004లో శాసనసభ్యుడు గా ఎన్నికైన తర్వాత రామలింగారెడ్డి  అనేక ఉద్యమాలు చేశారు.. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు వారి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినందుకు కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 2004 నుంచే నాకోసం ఎన్నికల్లో ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి సోలిపేట సుజాత అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమెనే పోటీలో నిలుస్తుండడం వల్ల సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ లో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయి.. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు.. ఇప్పుడు రామలింగారెడ్డి ని స్ఫూర్తి గా తీసుకుని ఆయన సతీమణి సుజాత పనులు పూర్తి చేస్తుందన్నారు. పేదల కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి రామలింగారెడ్డి.. దుబ్బాక దశ దిశ మార్చిన గొప్ప వ్యక్తి.. రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది.. మేమిద్దరం కుడి ఎడమ భుజం వలే పనిచేస్తాం అన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈరోజు రామలింగారెడ్డి సతీమణిని కలిసి.. మాతో పాటు ప్రచారానికి తిరిగేందుకు తీసుకెళ్లేందుకు వారి ఇంటికి వచ్చామన్నారు.

రామలింగారెడ్డి ఆశయాలు నెరవేర్చేందుకు వస్తున్నా-సోలిపేట సుజాత

సీఎం కేసీఆర్ నాకు కన్నతండ్రి లాంటివాడు.. మా పెళ్లి.. , మా పిల్లల పెళ్లిళ్లు చేశారు.. కెసిఆర్ నాకు కొండంత ధైర్యం.. నా భర్త చనిపోతే ఇంటికి వచ్చి ధైర్యం ఇచ్చిండు.. నాకు టిఆర్ఎస్ టిక్కెట్ కేటాయించినందుకు కెసిఆర్ కు, మంత్రి హరీష్ రావు కు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపారు దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే నేను ముందుకు వస్తున్నానని స్పష్టం చేశారు.