
ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తూ పేదలకు అండగా నిలిచిన కేసీఆర్ను మూడోసారి సీఎంను చేస్తామంటూ ఉప్పల్ సెగ్మెంట్ పరిధి మీర్పేట శ్రీనివాస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు తెలిపారు. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని మంగళవారం శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. వారి వెంట కార్పొరేటర్ జెర్రపోతుల ప్రభుదాస్ ఉన్నారు.
ఉప్పల్ డివిజన్లోని సూర్యనగర్ కమ్యూనిటీ హాల్లో గోల్డెన్ బోర్డ్స్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఆయనకు మద్దతు తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.