హైదరాబాద్కు భారీ వర్ష సూచన

హైదరాబాద్కు భారీ వర్ష సూచన

తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. భారీ వర్షాలతో హైదరాబాద్  ప్రజలకు అధికారులు అలర్ట్స్ ఇచ్చారు . ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావర శాఖ హెచ్చరికలతో  అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.  వీకెండ్ లో అనవసరంగా బయటకు రావొద్దన్నారు. వర్షం తగ్గాక హడావిడిగా బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవడద్దన్నారు. జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది.  SRSP 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 50వేల 714 క్యూసెక్కుల ఇన్ ఫ్లో... 38వేల 864 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 కాగా.. ప్రస్తుతం 1087 అడుగులుగా ఉంది.  నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 678.475 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 6వేల 247 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 7వేల 245 క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్ పెనుగంగా నదికి వరద కొనసాగుతోంది. చెనాక కోరాట బ్యారేజ్ దగ్గర 49వేల క్యూసెక్కులుగా ఉంది.