నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

హైదరాబాద్ : రాబోయే మూడు, నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్సుందన్నారు. గత 24గంటల్లో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కొన్ని చో ట్ల మోస్తరు వర్షాలు.. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదు అయ్యాయన్నారు. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 సెం.మీ వర్షపాతం నమోదు అయిందన్నారు. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి 4సెం.మీ వర్షం పడిందని తెలిపారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న.