తెలంగాణ రైతులకు.. వాట్సాప్ ద్వారా వెదర్ రిపోర్ట్: కేంద్రం

తెలంగాణ రైతులకు.. వాట్సాప్ ద్వారా వెదర్ రిపోర్ట్: కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: ‘మిషన్ మౌసమ్’కింద పంచాయతీ మౌసమ్ సేవా పోర్టల్ ద్వారా వాతావరణ హెచ్చరికలను రైతులకు నేరుగా వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎంపీ అర్వింద్ ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్ర సింగ్ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డోప్లర్ వెదర్ రాడార్ (డీడబ్ల్యూఆర్) ద్వారా వాతావరణ పరిశీలన సేవలు అందిస్తున్నట్లు ఈ సమాధానంలో పేర్కొన్నారు.

నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోని వరి, పసుపు, మొక్కజొన్న పంటలకు ప్రత్యేక వాతావరణ ఆధారిత సూచనలను వారానికి రెండుసార్లు (మంగళ, శుక్రవారాల్లో) అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 369 వర్షపాత మాపకాలు, 52 ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌‌‌‌లు, 31 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.